Advertisement | विज्ञापन

Jathi Ratnalu: అమెజాన్ ప్రైమ్‌లో ‘జాతిరత్నాలు’ సినిమా రిలీజ్

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘జాతిరత్నాలు’. కామెడీ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బాస్ట్రర్ హిట్ సాధించింది.

ఈ సినిమా ఓవర్సీస్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాల్లో అతిపెద్దహిట్ ఈ మూవీనే. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఉప్పెన.. మేకింగ్‌ వీడియోలు చూశారా..? ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్‌ బిజినెస్‌ జరుపుకుంది. ఈ క్రమంలో ఎన్నో సినిమాల బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్‌, రూ.70 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. వైజయంతి మూవీస్ సమర్పణలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.

భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ ఇండియా ఈ రోజు (ఏప్రిల్‌ 11) నుంచి స్ట్రీమ్ కానుంది. దీనికి సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాలో నవీన్‌కు జోడిగా ఫరియా అబ్దుల్లా నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండలు కూడా కనిపించి అలరించారు.

Leave a Comment